ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బంగారి రాజు

కొత్తగూడ ఆగస్టు 25 జనంసాక్షి:తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న బంగారి రాజు (28) ఇతని స్వగ్రామం ఏజెన్సీ ప్రాంతమైన మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎంచగూడ గ్రామానికి చెందిన రాజు నిరుపేద కుటుంబానికి చెందిన బంగారి కొమ్మక్క భర్త కీ:శే కొమ్మయ్య కొత్తగూడ లోని గర్ల్స్ హాస్టల్లో డైలీ వైస్ వర్కర్ గా పనిచేస్తూ కుటుంబ బరాన్ని మోస్తూ ఉంది.తల్లికి కొంత ఆర్థిక సహాయంగా ఉండాలని నర్సంపేట పట్టణ ప్రాంతంలో అమాలి కూలిగా పనిచేస్తూ కుటుంబానికి కొంత ఆసరగా ఉండడం జరిగింది.ఇలా కొంతకాలం గడిచిన తరుణంలో గత వారం రోజులుగా
తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధి రావడం తో ప్రస్తుతం హన్మకొండ లోని లాస్య క్లినిక్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉండడం జరిగింది.డాక్టర్ల సూచన మేరకు ఇంకా మెరుగైన వైద్యం అందవలసి ఉన్నది.కూలి చేస్తే గాని పొట్ట గడవని స్థితిలో అతని కుటుంబం ఉంది.ఇతనికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.తండ్రి లేడు…తల్లి రోధిస్తూ తన కొడుకుని ఎలాగైనా బతికించాలని దాతల సహకారం కోరుతుంది.తనకు ఆసరగా ఉంటాడనుకున్న కొడుకు ఒక్కసారిగా ఆస్పత్రి లో ఉండడంతో కన్నీటి పర్వతం అయింది.తన కొడుకు మెరుగైన వైద్యం కోసం డబ్బులు ఖర్చవుతాయని డాక్టర్ చెప్పారని ఆర్థిక స్థితి లేని కారణంగా ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటుంది.మీకు తోచిన ఆర్థిక సహాయం అందించాలని తల్లి వేడుకుంటుంది.ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే ద్వారా 7330968710 నెంబర్ కు పంపి నా కొడుకును ఎలాగైనా బతికించాలని కోరుతుంది.