,ప్రజా పరిపాలన దార్శినికుడు సీఎం కేసీఆర్
అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.
అలంపూర్ ఆగష్టు 25(జనంసాక్షి )
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని గత తొమ్మిదేండ్లలో సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం అన్నారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో 7 మండలాల పరిధిలో గ్రామాల వారికి మరియు 3 మున్సిపాల్టీ పరిధిలోని బిసి కులవృత్తులకు లక్ష రూపాయల చెక్కులను 294 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అబ్రహం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,చేతి వృత్తులు చేసుకుని జీవిస్తున్న వెనకబడిన తరగతుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అని వారు అన్నారు.దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఆసరా సాహయం అసహాయుల జీవితాల్లో ఉషోదయం అని ఆయన అన్నారు.అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన అన్నారు. గడిచిన ప్రభుత్వ హయాంలో 70 రూపాయల పెన్షన్ ఇస్తే
నేడు వృద్ధులకు,వితంతువులకు,చేనేత కార్మికులకు,బీడీ కార్మికులకు 2016/-లను,వికలాంగులకు 3016/-ల నుండి 4016/- రూ అందిస్తున్న ప్రభుత్వం అని ఆయన తెలిపారు.కళ్యాణ లక్ష్మి ,షాదిముబారక్ పథకం దేశానికి ఆదర్శం నిలుస్తుంది అని వారు తెలిపారు.పేదింటి ఆడపిల్లకు మేనమామ గా సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.దేశానికే స్ఫూర్తినిచ్చే విధంగా డా. బీ.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనే లక్ష్యంగా తెలంగాణ దళిత బంధుతో దళిత సాధికారత కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న సీఎం శ్రీ కేసీఆర్ అని ఆయన అన్నారు.సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది అని ఆయన అన్నారు . ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ,రైతుబంధు పథకం,రైతుబీమా పథకం, కె.సి.ఆర్. కిట్ పథకం ఆరోగ్య లక్ష్మి పథకం,కంటి వెలుగు,తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు,తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్,కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం,ఆరోగ్య మహిళ,గృహలక్ష్మి పథకం,ఆహార భద్రత పథకం,డబుల్ బెడ్రూమ్,పథకం,చేనేత లక్ష్మి పథకం,గొర్రెల పంపిణీ పథకం,చేనేత మిత్ర పథకం,నేతన్న బీమా పథకం ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయని అన్నారు .కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన అన్నారు.కస్తూరిబా గాంధీ, మహాత్మా జ్యోతి రావు పూలే,మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్,మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యా ,నాణ్యమైన బోజన,వసతి కల్పించి పేదవారికి ఘనమైన విద్యను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు వైద్య రంగంలో ఎంతో పురోగతి సాధిస్తూన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.ప్రతీ గడపకు సంక్షేమన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు.సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.ప్రజా పరిపాలన దార్శినికుడు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కాషాపోగు రాజ్, గార్లపాడ్ సర్పంచ్ భూషణం,సంకపురం రాముడు ఎర్రవల్లి యూవనాయకుడు కృష సాగర్ , నీలి శ్రీను,వివిధ , సర్పంచులు ఎంపీటీసీలు మరియు BRS పార్టీ నాయకులు మరియు అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.