ఉప్పల్ ఎమ్మేల్యే అభ్యర్థి డా.ప్రియాంక
కాప్రా, నవంబర్ (జనంసాక్షి)
ఆమ్ ఆద్మి పార్టిని ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని ఆమ్ ఆద్మి పార్టి ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి డా.మార్తినేని ప్రియాంక అన్నారు. ఆమె ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించి సభ్యత్వ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు ఆమ్ ఆద్మి పార్టి పట్ల ఆకర్షితులై స్వచ్చందంగా సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని అన్నారు. ఆప్ పార్టి పట్ల ప్రజలకు మంచి విశ్వాసం ఉందని అన్నారు. ఆమ్ ఆద్మి పార్టికి 100 మంది సభ్యత్వం చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ పార్టి నాయకులు సంయుక్త మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




