Thursday, 5 November 2026

కాప్రా డివిజన్‌లో టీడీపీ ప్రచారం

కాప్రా, నవంబర్‌ (జనంసాక్షి)

కాప్రా డివిజన్‌ పరిధిలోని నేతాజినగర్‌, వంపుగూడ నాయక్‌ నగర్‌, మహ్మదీయ కాలనీలలో తెలుగుదేశం పార్టి నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తూళ్ళ వీరేందర్‌ గౌడ్‌కు ఓటు వేసి గెలుపించాలని ప్రజలను కోరారు. ఈ నియోజకవర్గం టిడిపి మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అభివృద్ది జరిగిందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్‌ టిడిపి అధ్యక్షులు అల్లం అయిలయ్య యాదవ్‌, ప్రధాన కార్యదర్శి ముదిగొండ పాండు, మహిళా నాయకురాలు డి.ఇందిరాగౌడ్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.