అడిలైడ్: వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న ఓ సన్నాహక మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇండియా 153 పరుగులతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. 365 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేసింది. నౌరోజ్ మంగళ్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 60 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఉస్మాన్ ఘనీ 44 పరుగులతో రాణించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ సెంచరీ, రహానే అర్ధ సెంచరీలతో కదం తొక్కగా 5 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది.





