హైదరాబాద్ : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది ఐఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఈ ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.





