నిర్మల్ బ్యూరో, జూన్ 14,జనంసాక్షి,,
ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంకు చెందిన 20 మంది యువకులు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆప్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ వారికి ఆప్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సయ్యద్ హైదర్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కేంద్రంలో చేస్తున్న సామాజిక సేవలను చూసి పార్టీలోకి వస్తున్నారన్నారు. నిర్మల్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. తమపై నమ్మకంతో పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ అద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో పలువురు యువకుల చేరిక




