Wednesday, 4 November 2026

కారుదిగి చేతిపట్టుకున్న ఉద్యమ నేత..గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావ్

నిర్మల్ బ్యూరో, జూన్14,జనంసాక్షి,, బిఅరెస్ మాజీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు ఉద్యమ నేత కుచాది శ్రీహరి రావ్ కారుదిగి చేతిపట్టుకున్నారు.బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోకాంగ్రెస్కండువాకప్పుకున్నారు.2009,2014 లో బీఆరెస్ కారు గుర్తు తో పోటి చేసి స్వల్ప ఓట్ల తేడతో ఓడిపోయారు.2018 లో అధిష్ఠానం ఏనుగు గుర్తుపై గెలిచి బిఅరెస్ లో చేరిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వడం తో చేసేదేమీ లేక ఇంద్రకరణ్ రెడ్డి గెలుపుకు కృషి చేశారు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మేలుచేయడం లేదని ,ఉద్యమం లో పనిచేసిన కార్యకర్తలను విస్మరించడం, నామినేటెడ్ పదవులు,పార్టీ పదవులు అన్ని ఉద్యమ ద్రోహులకు కేటాయించడం వల్లనే పార్టీ వీడుతున్నాని తెలిపారు. ఆయన తోపాటు ఉద్యమ సమయంలో పనిచేసిన, పొడిల్లి గణేష్,బోలోజి నర్సయ్య,శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి,, రాంరెడ్డి, బురాజ్,తో పాటు పలువురు సర్పంచ్ లు కారుదిగి హస్తం పార్టీలో చేరారు.