;– బంగారు తెలంగాణ దిశగా ముందడుగులు
;- తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం
;-ప్రతి జిల్లాకు వైద్య కళాశాల
;-కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు
;-రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్
;- సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 14:-ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు బాగున్నా యని, బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శమని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో వైద్య ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన షార్ట్ ఫిలిం ను, పాటను సభలో ప్రదర్శించారు.జిల్లా
వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ గాయత్రీ దేవి వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర , జిల్లా పురోగతిని
తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న వైద్య సదుపాయాలు, తెలంగాణ వచ్చిన తరువాత జిల్లాలో సమకూరిన సౌకర్యాలను, సాధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు.
కెసిఆర్ కిట్, కంటి వెలుగు లబ్ధిదారు లు, డయాలసిస్ సేవలు పొందిన లబ్ధి దారు, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వంతో తమకు చేకూరిన లబ్ధి గురించి వారి మనోభావాలను సభాముఖంగా తెలియజేసి, తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణను అన్ని రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి దన్నారు.
వైద్య ఆరోగ్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే, నేడు నేను పోతాను సర్కారు దవఖానకు అన్న స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలు విస్తరించాయన్నారు. దేశంలో ఎవరూ చేయని అభివృద్ధిని రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో చేసిందని, మరింత చేస్తుందనారు.
అనంతరం లాంచనంగా న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభించి,గర్భిణులకు అందజేశారు. ఆశాలకు, ఏఎన్ఎం లకు, స్టాఫ్ నర్స్ లకు యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు.
జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఏఎన్ఎంలు,ఆశాలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు,ఫార్మసిస్ట్ ,
ల్యాబ్ టెక్నీషియన్ లకు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారికి, డ్రగ్ సేఫ్టీ అధికారిని
మేమొంటో, ప్రశంసాపత్రంతో సన్మానించారు.
కార్యక్రమానికి ముందు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గాయత్రి దేవి, జి జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ అనిల్, మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్,
సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ లతా విజయేందర్ రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్, ఎంపీపీ లు,జడ్పిటిసి ,ఎంపీటీసీ లు, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, అంగన్వాడి వర్కర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులు, అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




