ఆయిల్ ఫామ్ పంటల సాగుపై రాయతీని సద్వినియోగం చేసుకోవాలి.
కోటగిరి డిసెంబర్ 8 జనం సాక్షి:-ఆయిల్ ఫామ్ పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి కోటగిరి మండల సర్పంచ్ ఫోరం కన్వీనర్ పత్తి లక్ష్మణ్ అన్నారు.గురువారం కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అధికారులు,ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంటల సాగును ప్రోత్సహించుటకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పించిందన్నా రు.మొక్క ఖరీదుపై 85 శాతం,డ్రిప్పై90శాతం,ఎరువుల ఖరీదుకై 4200 రూపాయలు ఒక ఎకరానికి పంట పెట్టిన మొదలు నుండి నాలుగు సంవత్సరాల వరకు ఇస్తుందన్నారు.ఈ పంటలలో అంతర పంటగా రబీ పంటల ను సాగు చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయిల్ ఫామ్ పంటల రాయితీ సాగు ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మారుతీ,ఏవో శ్రీనివాస రావు,
ఏపీవో రమణ,స్థానిక సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు, స్థానిక ఎంపిటిసి సలీం,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కిషోర్ బాబు,టిఎ రాజేష్, కోటగిరి గ్రామ సెక్రెటరీ రాజేందర్,ఏఈఓలు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.




