Thursday, 5 November 2026

ఘనంగా ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి జయంతి వేడుకలు

ఘనంగా ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి జయంతి వేడుకలు

రామన్నపేట డిసెంబర్ 8 (జనంసాక్షి)
మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి జయంతి పురస్కరించుకొని రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించినారు. మాజీ ఎంపిటిసి సాల్వేర్ అశోక్ రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ మాట్లాడుతూ రామన్నపేట నియోజవర్గానికి ఆయన చేసిన సేవలు మరువ రానీవని నియోజకవర్గానికి తీరనిలోటని ఆయన సేవలు చిరస్థాయిలో ఉండిపోతాయని వారు అన్నారు. తహసిల్దార్ కార్యాలయం, ఏరియా హాస్పిటల్, ఏరియా కాంప్లెక్స్, డిగ్రీ కళాశాల, ఎంపీడీవో కార్యాలయం ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మలగూడెం మాజీ ఎంపిటిసి నాగులంచ అంజయ్య మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుకుల శివ మండల కిసాన్ సేల్ అధ్యక్షులు మొహమ్మద్ ఎజాస్ మండల కాంగ్రెస్ నాయకులు మేడి శంకరయ్య, తోటకూరి అంజయ్య, నోముల లింగస్వామి, మొహమ్మద్ నాసర్, యాదయ్య, మొహమ్మద్ హఫీజ్, మహమ్మద్ ఇంతియాజ్, మల్లేష్ ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.