Wednesday, 4 November 2026

బచ్చోడు గ్రామ కేంద్రంగా కంటి వెలుగు వైద్య రెండో శిబిరాన్ని ప్రారంభీంచిన: ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.

 

ఖమ్మం తిరుమలాయపాలెం (జనవరి 25) జనం సాక్షి. మండలం పరిధిలోని బచ్చోడు గ్రామపంచాయతీలో పి హెచ్ సి సుబ్లేడు వైద్య శాఖ ఆధ్వర్యంలో రెండోవ విడత కంటి వెలుగు శిబిరా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ కంటి వెలుగు వైద్య శిభిర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్. మాట్లాడుతూ మార్ముల గ్రామాల్లో ఉచితంగా వైద్య శిబిరాల ద్వారా కంటి వైద్య పరీక్షలు నిర్వహించీ అర్హులైన వారికి వైద్య చికిత్స, కళ్లద్దాలు తదితర సమాగ్రీలు ఇవ్వడం జరుగుతుందని, స్థానిక ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు కంటి వెలుగు కార్యక్రమాలపై గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మన మండలంలో నూరుశాతం విజయవంతం కావాలని, వైద్య శిబిరంలో ప్రజలందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని, శిబిర కేంద్రంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్నీ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక వైద్య అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం నాయక్,పిహెచ్ సీ సుబ్లేడు వైద్యాధికారి వసుంధర, స్థానిక సర్పంచ్ రామాసహయం హరిత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు,స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.