టేకులపల్లి, ఫిబ్రవరి 8( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని మొక్కం పాడు గ్రామములో రైతులకు ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కార్యక్రమము బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమములో భాగంగా ఇల్లందు సహాయ వ్యవసాయ సంచాలకులు పి. వాసవిరాని పాల్గొని మాట్లాడుతూ మలేసియా నుండి నూనె దిగుమతి చేసుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూన్నదని దాని కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలతో రైతులకు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ అందిస్తున్నారని తెలిపారు.
నీటి లభ్యత సమృద్ధిగా ఉండి కరెంట్, ఫెన్సింగ్ ఉంటే రైతులకు 5 ఎకారాలలోపు 100% సబ్సిడీపై ఎకరానికి 57 మొక్కలు ,4 సంవత్సరాలు ఎకరానికి 4200 రూపాయలు అకౌంట్స్ లో వేస్తారని తెలియజేసారు. దిగుబడి మూడు సంవత్సరాల తర్వాత 5 టన్నుల గెలలు,5 సంవత్సరాల తర్వాత 10 టన్నుల దిగుబడి వస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మొక్కంపాడు సర్పంచ్ బాణోత్ విజయ, ఆయిల్ పామ్ గోద్రెజ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాదరావు, అసిస్టెంట్ రాము కొఠారి డ్రిప్ కంపెనీ నుండి బిక్షం రెడ్డి, మండల వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ, విస్తరణాధికారి రమేష్,ఎటిఎం ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.




