Wednesday, 4 November 2026

మెట్ పల్లి లో 11 జిల్లాల పద్మశాలి నాయకుల సమావేశం

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 08,జనంసాక్షి :మెట్పల్లి పట్టణంలోని పద్మశాలి సంఘ కమ్యూనిటీ హాల్లో 11 జిల్లాల పద్మశాలి అధ్యక్ష కార్యదర్శుల ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా జరిగింది.ఈ ఈ సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి జగిత్యాల్, పెద్దపల్లి, మంచిర్యాల్, ఆసిఫాబాద్, అదిలాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్ పది జిల్లాలకు సంబంధించినటువంటి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో ఈరోజు మెట్ పల్లిలో పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్లో పద్మశాలి ఆత్మగౌరవ సభ సమాలోచన సమావేశం నిర్వహించుకోవడం జరిగింది.ఈ సమావేశంలో 2లక్షల మంది పద్మశాలి కుటుంబ సభ్యులతో పద్మశాలి ఆత్మగౌరవ సభను పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ సభకు చైర్మన్ గా బస్వా లక్ష్మినర్సయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమ సమావేశంలో నాయకులు భోగ వెంకటేశం,సాంబారి ప్రభాకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మిగతా జిల్లాల అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు, మరియు మర్రి సహదేవ్ ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.