మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 08,జనంసాక్షి :మెట్ పల్లి పట్టణములోని జువ్వాడి నర్సింగ్ రావు గృహంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడి గా నూతనంగా ఎన్నికైన అందే మారుతీని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఘనంగా సన్మానం చేసినారు. ఈ సందర్బంగా జువ్వాడి నర్సింగరావు రావు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీలో కష్ట పడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ఉన్నత స్థాయి అవకాశాలు వస్తాయి అని అన్నారు. మొదటి నుండి అందే మారుతీ కాంగ్రెస్ పార్టీ లో కష్టపడుతున్నారు అని రాబోవు రోజుల్లో ఇంకా కష్టపడి పని చేయాలని అన్నారు. అనంతరం మెట్ పల్లి పట్టణ 17వ వార్డ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గా ఉడుత లావణ్య ని మెట్ పల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలు అందే భవిత రాణి ఆధ్వర్యంలో జువ్వాడి నర్సింగరావు నియామక పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందే భవిత రాణి,మెట్ పల్లి పట్టణ 24వ వార్డు మహిళా అధ్యక్షురాలు హరిత,పారిపల్లి రాజేశ్వర,కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి,మెట్పల్లి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జట్టి లక్ష్మణ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆఫీజ్. మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఇల్లెందుల రాజు,బొడ్ల ఆనంద్, కైలాష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.




