Wednesday, 4 November 2026

ఆయుష్మాన్ భారత్ పథకం తేదీ పొడగించాలి

 

 

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 05 (జనం సాక్షి) ఆయుష్మాన్ భారత్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రజా ఆరోగ్యకరమైన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంలో విఫలమైంది. వీఆర్వోలు ఏఎన్ఎంలు మొదలైన ఆర్పీల ద్వారా విస్తృత ప్రచారం చేయవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల మార్చి 31 తారీకు వరకే దానికి చివరి తేదీగా నిర్వహించడం జరిగింది. చాలామంది పేద ప్రజలు ఆయుష్మాన్ పథకం గురించి పూర్తిస్థాయిలో అవగాహన లేక ఒక 5% కూడా దాన్ని వినియోగించుకోలేదని ఓ బి సి జిల్లా అధికార ప్రతినిధి మెంతుల యాదగిరి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మళ్లీ దానికి  రెండు నెలలు పొడిగించాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు   దీనిని వినియోగించుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించి ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ పై విస్తృత ప్రచారం చేయాలని యాదగిరి కోరారు . ఆరోగ్యశ్రీ సేవలు ఏ విధంగానైతే ఉపయోగించుకుంటున్నారో ఆయుష్మాన్ భారత్ అనే పథకం కేంద్ర ప్రభుత్వ   ప్రవేశపెట్టిన పథకాన్ని అదే స్థాయిలో ఉపయోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివిధ  పిఆర్ఓ ల ద్వారా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు