Tuesday, 3 November 2026

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బిజెపి.ఎమ్మెల్యే సైదిరెడ్డి

 

 

 

 

 

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.చదువు రాని బండి సంజయ్  పసలేని ఆరోపణలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని హుజూర్ నగర్  ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు.బుధవారం బిఆర్ఎస్ పట్టణ కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి నాయకులు తమ తప్పులను కప్పించుకోవడానికి అత్య ప్రచారాలు చేస్తున్నారని, కులాల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి పనులను బిజెపి అడ్డుకుంటుందని, పిల్లల జీవితాలతో బిజెపి రాజకీయం చేస్తుందని, బండి సంజయ్ లాంటి అబద్దపుకోరు నాయకులు లేడని అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ నెంబర్ వన్ అని, దేశంలో రైతులు దళితులు కేసీఆర్ లాంటి నాయకులు కావాలని కోరుకుంటున్నారని,దేశానికి రాష్ట్రానికి కెసిఆర్ శ్రీరామరక్ష అని.దేశానికి ఏమి కావాలో తెలిసిన నాయకుడు కెసిఆర్ అని.దేశ ప్రతిష్ట  బిజెపి దెబ్బతీస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు.పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి,మార్కెట్ ఛైర్మెన్ నాగండ్ల శ్రీధర్,మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు,వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, గ్రంథాలయం అధ్యక్షుడు గుర్రం మార్కండేయ,మత్స్యశాఖ అధ్యక్షుడు యామిని వీరయ్య,ఎంపీటీసీ లింగయ్య యాదవ్,టిఆర్ఎస్ నాయకులు, కొణతం సత్య నారాయణ రెడ్డి, వల్లంసెట్ల రమేష్ బాబు,చిత్తలూరి సైదులు,తదితరులు ఉన్నారు.