– చెన్నమనేనికి హైకోర్టులో తాత్కాలిక ఊరట
హైదరాబాద్,సెప్టెంబర్ 11,(జనంసాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర ¬ంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా కోర్టు నిలిపివేసింది. పౌరసత్వం రద్దుపై పునఃసవిూక్షించాలని కేంద్ర¬ంశాఖను రమేశ్ కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థనపై ఆరు వారాల్లోగా తేల్చాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ¬ంశాఖ గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని ¬ంశాఖ సంయుక్త కార్యదర్శి నిర్దారించారు. దీనిపై ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వం రద్దుపై నిర్ణయాన్ని వెలువరించే ముందు తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రమేశ్ వేసిన పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. పౌరసత్వం రద్దుపై నిర్ణయాన్ని వెలువరించే ముందు తన వాదనలు వినిపించేందుకు ఆవకాశం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ¬ంశాఖ ఆగస్టు 31న ఏకపక్షంగా జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని అభ్యర్థించారు. రివిజన్ దాఖలు చేసుకోవడానికి 30 రోజుల గడువుఇవ్వాలని చట్టం స్పష్టంగా తెలియచేజేస్తున్నప్పటికీ, ఆవకాశం ఇవ్వకుండా ¬ంశాఖ జారీచేసిన ప్రొసీడింగ్స్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇండియన్ సిటిజన్‌షిప్ చట్టంలోని సెక్షన్ 10(3) ప్రకారం అభ్యర్థనను పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను కేంద్ర¬ంశాఖ పరిగణనలోనికి తీసుకోలేదని తెలిపారు. సిటిజన్‌షిప్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి భారతదేశ పౌరసత్వం జారీచేస్తే, పౌరసత్వం జారీతో బాధితుడైన వ్యక్తి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి పౌరసత్వం ధ్రువపత్రాన్ని సవాల్ చేస్తూ దరఖాస్తుచేయాలి. 2009 ఫిబ్రవరి 3న కేంద్ర ¬ంశాఖ నాకు జారీచేసిన పౌరసత్వంతో ఆది శ్రీనివాస్‌కు ఎటువంటి నష్టం కలుగలేదు. 30 రోజుల్లో దరఖాస్తు చేయడానికి బదులుగా నేను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక 2010లో పిటిషన్ దాఖలుచేశారు. భారతదేశంలో జన్మించి, ఇక్కడే పెరిగిన వ్యక్తులకు పౌరసత్వం ఇచ్చేందుకు నిరాకరించవద్దని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. నేను ఇక్కడే జన్మించా. జర్మనీలో మాస్టర్స్ డిగ్రీ చేసి అక్కడే ఉద్యోగంలో చేరా. ద్వంద్వ పౌరసత్వం లేనందున 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించాను. 1990లో స్వచ్ఛంద సంస్థ ద్వారా కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.100 కోట్లతో 250 గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాను. సిటిజన్‌షిప్ చట్టం సెక్షన్ 10(3) ప్రకారం ఒక వ్యక్తి కారణంగా దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజలకు హాని కలిగించేలా ఉంటే మినహా, ఆ వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదు. ఈ విషయంలో నా అభ్యర్థనను పరిశీలించాలని కేంద్ర ¬ంశాఖకు ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసినప్పటికీ కనీసం పట్టించుకోలేదని హైకోర్టుకు వివరించారు.




