సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 17:-స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించడానికి ఆయా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఈఆర్ ఓ, ఏఈఆర్వోలకు సూచించారు.
బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసి ఏరియా ఓటర్ జాబితాకు
సంబంధించిన
వివిధ అంశాలపై
సంబంధిత ఆర్డిఓ, పటాన్చెరు, ఆర్ సి పురం తహసిల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓకే ఇంటి నంబర్ లో ఆరు కన్నా ఎక్కువ ఓటర్లు నమోదైన ఇండ్లను ఫిజికల్ గా పరిశీలించాలన్నారు.
అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ వేరు వేరు పోలింగ్ స్టేషన్లలో ఓటరుగా ఉన్న వారి జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు.
ఎక్కువగా ఓటర్లు నమోదైన పెద్ద గేటెడ్ కమ్యూనిటీలను గుర్తించి అవసరమైతే పోలింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాలలో 13 కేటగిరీలలో బిఎల్ఓ లను నియమించినట్లు తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గంలో 363 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అందులో జిహెచ్ఎంసి పరిధిలో 109 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
గత 2018 ఎన్నికల్లో
జీహెచ్ఎంసి ఏరియాలో 71.52 శాతం ఓటర్ టర్న్ అవుట్ నమోదయిందని, దానిని మరింత పెంచే దిశగా ఓటర్లకు అవగాహన కల్పించాలని, పెద్ద ఎత్తున స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని ఏఈఆర్ఓ లకు సూచించారు.
పటాన్చెరు నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలో ఆరు కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న 7355 ఇండ్లలో 6875 ఇండ్లను పరిశీలించడం పూర్తయిందని,ఇంకా
480 ఇండ్లను త్వరితగతిన వెరిఫై చేయాలని సంబంధిత ఏ ఈ ఆర్ ఓ లకు ఆదేశించారు.
7355 ఇండ్లలో గల 92018 మంది ఓటర్లకు గాను క్షేత్ర పరిధిలో 78,956 ఓటర్లను వెరిఫై చేయడం జరిగిందని, అందులో 1527 మంది నుండి ఫారం – 8 తీసుకోవడం జరిగిందన్నారు.మరో 13062 మంది ఓటర్లను పరిశీలించాల్సి ఉందన్నారు. మొత్తం ఓటర్లలో 45 మంది మరో ప్రాంతానికి షిఫ్ట్ కాగా,32 మంది చనిపోయినట్లు గుర్తించి ఓటర్ జాబితా నుండి తొలగించినట్లు వెల్లడించారు.
పటాన్చెరు నియోజకవర్గంలో 260 లొకేషన్లలో 363 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 122 లొకేషన్లలో రెండు కన్నా ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు.
ఫారం- 8 ఎన్ని వచ్చాయన్న వివరాలను ఇవ్వాలని, అదేవిధంగా బిఎల్ఓ లతో సమావేశం నిర్వహించి ఆయా ఆక్టివిటీస్ చేయించాలని సంబంధిత ఏ.ఈ.ఆర్.ఓలకు సూచించారు. పదిహేను వందల కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సంగారెడ్డి
ఆర్ డి ఓ నగేష్, పటాన్చెరు ,ఆర్ సి పురం మండలాల తహసిల్దార్లు,జిల్లా ఎలక్షన్స్ సెల్ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




