Thursday, 5 November 2026

సీయం కప్ మండల స్థాయి క్రీడా బహుమతుల ప్రధానం

 

 

 

 

 

 

 

 

ఖానాపూర్ రూరల్17 మే (జనం సాక్షి): గ్రామీణ స్థాయిలో ఉన్న యువత క్రీడా నైపుణ్యం ను వెలికితీయలనే ఉదేశం తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గత మూడు రోజులు గా నిర్వహించిన సీ యం కప్ క్రీడా పోటీలు బుధవారం ముగిసాయి,ఈ సందర్భంగా మూడురోజులు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి ఎంపిపి మోహిద్,మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు కబడ్డీ విన్నర్స్ ఖానాపూర్ మున్సిపల్,రన్నర్స్ గా గోసంపెల్లి టీమ్, వాలీబాల్ విన్నర్స్ గోసంపెల్లి టీమ్, రన్నర్ గా ఖానాపూర్ మున్సిపల్ టీమ్, కోకో లో విన్నర్స్ గా గోసంపెల్లి టీమ్, రన్నర్స్ గా ఖానాపూర్ మున్సిపల్ టీమ్, కోకో లో విన్నర్స్ గా గోసంపెల్లి టీమ్, రన్నర్స్ గా ఖానాపూర్ మున్సిపల్ టీమ్ ,అథ్లెటిక్స్ లో 100 మీటర్స్ లో బి.శివకృష్ణ,సెకండ్ విజయ్,400 మిటర్స్ లో కె.మలికార్జున్,సెకండ్ శివకృష్ణ, కోకో గర్ల్స్ పాత ఎల్లపూర్ గెలుపొందగా వారికి ప్రశంసా పత్రాలు, షీల్డ్ లను అందజేశారు. ఈ గెలుపొంది న వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని ఎంపిపి మోహిద్,ఎంపిడిఓ బాలే మల్లేశం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఓ రాజా మోహన్,ఎమ్ పి ఓ చంద్రశేఖర్,ఎసై శంకర్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శనిగారపు శ్రావణ్,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మహాజన్ జితేందర్, పి టీలు కొల రాము,రపెల్లి రాజు యాదవ్,షేక్ ఇర్ఫాన్,ఎంపిటిసిలు, సర్పంచ్ లు ఆయా జిపి పంచాయతీ రాజ్ సెక్రటరీ లు పాల్గొన్నారు.