ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం

జనంసాక్షి జూన్ 14
కామారెడ్డి జిల్లా రాజంపేట్  మండలం ఆరేపల్లి గ్రామం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రామస్వామి ,మరియు సెక్టోరియల్ అధికారులు గంగ కిషన్, శ్రీపతి, వేణుగోపాల్, హాజరై వారు మాట్లాడుతూ ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పిల్లల సంఖ్య గణనీయంగా పెరగడం అభినందనీయమని ఈ పాఠశాలకు మూడు మండలాలు ఐదు గ్రామాల విద్యార్థులు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ కి మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలో అన్ని మౌలిక వసతులు మరియు అహ్లాదకరమైన  వాతావరణం ఏర్పాటు చేయడం అభినందనీయమని మరియు కార్పొరేట్ స్కూల్ కు దీటుగా ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లి ని అభివృద్ధి పరిచి అతి తక్కువ సమయంలో ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాల గా మార్చిన విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు ,గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి  అభినందిస్తూ  విద్యా శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయాలని వారు అన్నారు.
       ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము యాదగిరి, ఇన్చార్జి ఉపసర్పంచ్ చాకలి బాలయ్య, మండల విద్యాశాఖాధికారి రామస్వామి, సెక్టోరియల్ అధికారులు గంగ కిషన్, శ్రీపతి, వేణుగోపాల్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, హెచ్ఎం, విజయలక్ష్మి , తల్లిదండ్రులు అంకం సుధాకర్, శ్రీను, ఉపాధ్యాయులు అనురాధ, విద్యా వాలంటీర్లు భాగ్య, శ్రీలత, కారోబార్ సోపన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments