ఆరేళ్ల పిల్లాడ్ని కాల్చిన నాలుగేళ్ల బుడతడు!
న్యూజెర్సిలో ఘటన
వాషింగ్టన్ :ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలున్ని పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన ఘటన న్యూజెర్సిలో చోటుచేసుకుంది. సొమవారం సాయంత్రం ఈ ఘటనలో బాలుడు గాయలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించి పోలీసులు చిన్నారుల వివరాలను వెల్లడించలేదు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీ నియంత్రణ పై గట్టిగా పోరాడుతున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా..గత డిసెంబర్‌లో కనెక్టికట్‌లో జరిగిన మరణహమంలో ప్రాణాలొదిలిన చిన్నారుల తండ్రులను ఉద్దేశించి ప్రసంగించిన గంటలోపే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం