Tuesday, 3 November 2026

ఆరోగ్యకరమైన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవాలని డాక్టర్ హేమ్రాజ్ సింగ్

జనం సాక్షి దుబ్బాక. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను ఆయన అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న న్యూట్రిషన్ టికెట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల ఆరోగ్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆస్పత్రిలో గర్భిణీలకు నార్మల్ డెలివరీ అయ్యేందుకు వైద్య సిబ్బంది కృషి చేయడం జరుగుతుందని నార్మల్ డెలివరీ కానప్పుడు మాత్రమే ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలోకి వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర ఆపరేషన్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నామని తెలిపారు.