Tuesday, 3 November 2026

ఇంటింటికి బిజెపి

బచ్చన్నపేట జూన్ 24(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంటింటికి తెలిసేలా ప్రచారం చేయాలని బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజా డి బీరప్ప అన్నారు. శనివారం మహాజన సంపర్క్ అభియాన్ 9 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను మండలంలోని పసరమట్ల మరియు ఓబుల్ కేశవపురం గ్రామాలలో 220,221,204,205 బూత్ లలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ అసెంబ్లీ కన్వీనర్ బల్ల శ్రీనివాస్ , జిల్లా ఉపాధ్యక్షులు బెజాడి బీరప్ప గారు పార్లమెంట్ కో కన్వీనర్ కొంతం శ్రీనివాస్ గారు ఓబీసీ మోర్ఛ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు నారాయణ . మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షులు అఫ్జల్ . బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ నవీన్ కుమార్ . బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నటరాజ్ బూత్ అధ్యక్షులు రాజు . మహేష్ సిద్ధులు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు