ఆరోగ్యశాఖలో 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మహిళలు) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,666 పోస్టులతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో మరో 265 పోస్టులు కలిపి మొత్తంగా 1,931 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు సెప్టెంబర్ 19 సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్‌వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి.అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 49 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు కల్పించారు.హెల్త్ అసెస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040` 92,050గా నిర్ణయించారు.దరఖాస్తు రుసుం: ఆన్‌లైన్ దరఖాస్తు రుసుం రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లతో పాటు నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.