Wednesday, 4 November 2026

ఆరోగ్యశ్రీ కింద హెల్తీపై హాస్పిటల్ లో కిడ్నీలో రాళ్ల తొలగింపు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఆరోగ్యశ్రీ పథకం కింద అత్యాధునిక ఎండోస్కోపీ సర్జరీ ద్వారా తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన యరగాని శ్రీకాంత్ కు జిల్లా కేంద్రంలోని హెల్తి పై హాస్పిటల్ లో విజయవంతంగా కిడ్నీ స్టోన్స్ ను బ్లాస్టింగ్ చేసి తొలగించడం జరిగింది. వృత్తి పనుల కారణంగా హైదరాబాదులో ఉండే శ్రీకాంత్ అక్కడ పలు హాస్పిటల్స్ కి వెళ్లి తన అనారోగ్య విషయంలో సంప్రదించగా, అక్కడి వారు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి తొలగింపుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని తెలిపారు.పేద కుటుంబానికి చెందిన శ్రీకాంత్ అంత ఖర్చు పెట్టలేక మిత్రుల ద్వారా తెలుసుకున్న సమాచారంతో సూర్యాపేటలోని హెల్తీపై హాస్పిటల్ ని సంప్రదించగా ఆరోగ్యశ్రీ కింద విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసి కేవలం నాలుగు రోజుల్లోనే పరిపూర్ణ ఆరోగ్యకర పరిస్థితిలో డిశ్చార్జి చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కింద అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వంకు, మంత్రి జగదీష్ రెడ్డికి, అత్యాధునిక చికిత్స అందించిన హెల్తీ పై హాస్పిటల్ నిపుణులైన వైద్య బృందంకు, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.