గద్వాల నడిగడ్డ, మే 23 (జనం సాక్షి);మిజిల్స్, రుబెల్లా వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో మీజిల్స్,రూబెల్లా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన ఎలమినేషన్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 20 23 వరకు మిజల్స్ రోబెల్ల దేశంలో లేకుండా చూడటం జరుగుతుందన్నారు.ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే 9 నుండి 12 నెలల వరకు ఎంఆర్డోస్ ఒకటి 16 నుండి 24 నెలల లోపు వారికి ఎం ఆర్ డోస్ 2 ప్రతి పిల్లవానికి ఇవ్వాలన్నారు. ఎక్కడైనా ఎమ్మార్ పాజిటివ్ కేసు వెలువడితే ఆ ఇంటి చుట్టూ ప్రక్కల దాదాపు 300 ఇండ్లను సర్వే చేయాలన్నారు. ప్రతి ఇంట్లో 9 నెలల నుండి ఐదు సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారో వారికి అడిషనల్ గా వన్ ఎమ్మార్ డోస్ వ్యాక్సిన్, విటమిన్ ఏ ద్రావణం త్రాగించాలని తెలిపారు. జ్వరం ఉన్నవారికి సిరం శాంపిల్ ను తీసుకుని హైదరాబాద్లోని ఐపీఏం ల్యాబ్ కు పంపాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎం ఓ డాక్టర్ అజర్, డిఎంహెచ్వో డాక్టర్ శశికళ, డాక్టర్ స్రవంతి, డిడిఎం రామాంజనేయులు, డి వి ఎల్ ఎం నరేంద్ర బాబు డిపిఓ మాధవి,జిల్లా ఏపి డోమాలజిస్ట్ డాక్టర్ సుమిత్,తదితరులు పాల్గొన్నారు.




