ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామములో మంగళవారం ఉదయం ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణలో ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ మరియు ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ హైదరాబాద్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మేఘ వైద్య శిబిరానికి కొప్పుల స్నేహాలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమం సందర్భంగా కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ కొప్పుల స్నేహాలత మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం కావున మంచి ఆరోగ్యాన్ని మించిన సంపదంటూ ఏదీ లేదని అన్నారు. ప్రతీ ఒక్కరు ఇలాంటి మెఘ వైద్య శిబిరాలను ఉపయోగించుకొని రోగ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. తద్వారా శరీరంలో ఏవైనా జబ్బులు ఉంటే మనం టెస్టుల ద్వారా ముందే తెలుసుకుంటే వ్యాధిని తొందరగా అదుపు చేసుకోవచ్చు, ప్రారంభం దశలో వ్యాధి నిర్దారణ చేసుకోనిచో వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాపాయ దశకు చేరుతుందని కావున 40 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒకరు తప్పకుండా వ్యాధి నిర్దారణ పరీక్షలు తరచూ చేయించుకుంటే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్ళం అవుతామని అన్నారు. ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ మేనేజర్ జవహర్ కెన్నేడి మాట్లాడుతూ సమాజ సేవలో దైవత్వాన్ని దర్శించే గుణాన్ని కలిగి ఉండి ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయటం అభినందనీయమన్నారు. ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత వివిధ సందర్భాల్లో ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకొని మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ముందుకెళ్ళడం హర్షణీయమన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ వైద్య శిబిరంలో 569 మందికి ఉచిత వైద్యసేవలు అందించుట జరిగింది.ఇందులో 41 మందికి ఎక్స్ రే, 17 మందికి ఇసిజి, 187 మందికి రక్త పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందించి ఉచితంగా మందులను ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈర్ల చిన్నక్క, మొండయ్య, ఉపసర్పంచ్ గడ్డం దేవక్క,ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ కో ఆర్డినేటర్లు మామిడాల రవీందర్,స్వేచ్చ, బత్తుల భూమయ్య, ఆకుల సురేష్, నూతి మల్లన్న, ధర్మపురి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ అల్లం దేవక్క,ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సిబ్బంది జవహర్ కేన్నేడి, వార్డు సభ్యులు, ఆర్ ఎంపి డాక్టర్లు, ఆశా కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లు,వాలంటైర్స్ గడ్డం అనిల్, బిల్లకూరి అంజి, పాయిల్ల శ్రీనివాస్, బియ్యాల అజయ్, అల్లం శ్రీకాంత్,ఉపారపు సతీష్, గ్రామపంచాయితీ సిబ్బంది, పరిసర ప్రాంత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




