శంకరపట్నo: జనం సాక్షి ఏప్రిల్ 25గ్రామ గ్రామాన రెపరెపలడిన గులాబీ జెండా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ 25 వేడుకలను మండలంలో అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామాల్లో, మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేసి, మండలంలో పండగ వాతావరణాన్ని సృష్టించారు.మానకొండూర్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ నిర్వహించిన, భారత రాష్ట్ర సమితి మానకొండూర్ నియోజకవర్గ స్థాయి క్లీనరీ సమావేశానికి మానకొండూర్ కు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




