Monday, 2 November 2026

ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం.

నెన్నెల, మే 31, (జనంసాక్షి )నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం ఎంపీపీ సంతోషం రమాదేవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆరోగ్య కేంద్రం అభివృద్ధికై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సిబ్బంది పనితీరు పై, కంటివెలుగు కార్యక్రమంపై చర్చించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ అనీష్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము కాటుకు, కుక్క కాటుకు ప్రాథమిక చికిత్సకు సంబందించిన మందులు అందుబాటులో ఉన్నాయని, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈసమావేశంలో ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, సర్పంచులు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.