వికారాబాద్ రూరల్ మే 31( జనం సాక్షి)
వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త తన వంతు కృషి చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పరి ప్రసాద్ పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 32 వార్డులలో గడపగడపకు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని దీన్ని అరికట్టడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కే సాధ్యమవుతుంది అని అన్నారు గడపగడపకు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమానికి అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలలో విశేష స్పందన లభిస్తుందని త్వరలో జరగబోయే ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా కైవసం చేసుకోవడం ఖాయం అన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి యువజన విభాగం అధ్యక్షులు వేణుగోపాల్ పట్టణ వార్డు కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ గెలుపుకు కృషి




