జహీరాబాద్ ఏప్రిల్ 26( జనం సాక్షి ) నియోజకవర్గం, న్యాల్కల్ మండల పరిధిలోని వడ్డి గ్రామ పంచాయతీ నందు రు.22.48 లక్షల తో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. నేడు ప్రతి గ్రామంలో పీ హెచ్ సీ లలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు సమకూరాయి అన్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక, వైద్య సదుపాయాలు లేక పేద ప్రజలు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు అన్నారు.కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వైద్యాలయానికి పెద్ద పీట వేసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రజలకు మెరుగైన వైద్యము అందించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, ఎస్సి ఎస్టీ విజీలన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, వైస్ ఎంపీపీ గ్గౌస్, ఎంపీటీసీ సిద్దమ్మ, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు రవి కుమార్, సర్పంచ్ అబెద బేగం, ఉప సర్పంచ్ నర్సమ్మ, నాయకులు సంగమేశ్, శ్రీకాంత్ రెడ్డీ, రవి, రత్నం, తులసీదాస్ పాటిల్, మిథున్ రాజ్, బోజప్ప, పెంటప్ప, మహబూబ్ అలీ, గుండయ్యా స్వామీ తదితరులు పాల్గొన్నారు.




