జహీరాబాద్ ఏప్రిల్ 26( జనం సాక్షి)న్యాయవాదుల సమస్యలపై చర్చించుటకు ఏప్రిల్ 29 న ధర్నా చౌక్, ఇందిరా పార్క్, హైదరాబాద్ వద్ద ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ వారు నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొని విజవంతం చేయాలి. అని నాయకులు న్యాయవాది మహమ్మద్ నిజామోద్దీన్ రషీద్ లు అన్నారు. బుధవారం ఛలో హైదరాబాద్ వాల్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సలోమన్ మరియు న్యాయవాదులు టి. శ్రీనివాస్, శ్రీనివాస్ ఖన్న, రుద్రయ్య స్వమి, కార్తిక్ గౌడ్, జనార్ధన్, చెంద్రశేకర్ రెడ్డి, మహేష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.




