Tuesday, 3 November 2026

వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ.
నెన్నెల, నవంబర్ 30, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలో బుధవారం ఎస్సై రాజశేఖర్ తన సిబ్బంది తో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహన పత్రాలు సరిగా లేని వాటికి జరిమానా విధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వి చక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చని వివరించారు. వాహన దారులు అన్ని పత్రాలు సరిగా ఉండేలా చూసుకోవాలని, పెండింగ్ లో ఉన్న చాలాన్లు వెంటనే చెల్లించాలని, లేని ఎడల వాహనాన్ని సీజ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి సుఖమయ ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.