Thursday, 5 November 2026

ఆరో వార్డులో మెట్టుపల్లి లో పిచ్చి మొక్కలను తొలగిస్తున్న కౌన్సిలర్ కంచరవి

ఆరో వార్డులో మెట్టుపల్లి లో పిచ్చి మొక్కలను తొలగిస్తున్న కౌన్సిలర్ కంచరవి వనపర్తి టౌన్* : నవంబర్ 18 (జనం సాక్షి) 6వ వార్డు మెట్టు పల్లి లో ఇండ్ల మద్యలో పిచ్చి మొక్కలను ఎక్కువగా ఉన్నందున,రాత్రి వేళలో పాములు, తేలు రావడంతో వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వార్డు ప్రజలు స్థానిక కౌన్సిలర్ కంచరవి దృష్టికి తీసుకువెళ్లగా, కౌన్సిలర్ వెంటనే స్పందిస్తూ, శానిట్ ఇన్ స్పెక్టర్ రమెష్ దృష్టి కి తిసుకవెళ్లిగా, వెంటనే జవన్ కృష్ణ తో చెప్పి జెసిబి పంపిచడం తో ఈరోజు క్లిన్ చెయ్యడం జరిగింది, తదనంతరం వార్డు ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తూ స్థానిక కౌన్సిల్ కంచరవికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వార్డు సభ్యులు రంగమ్ రాములు, బి సచ్ఛిన్, స్వామి, రంగం వెంకటేష్ హనుమన్ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు.