Thursday, 5 November 2026

మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయండి

మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయండి
జెవివి మండల కార్యదర్శి రవికుమార్
పానుగల్ నవంబర్18 జనంసాక్షి
మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయాలని జెవివి మండల కార్యదర్శి రవికుమార్ కోరారు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నాడు మండలంలోని 12 ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయిలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించారు. 8 9 10 తరగతి విద్యార్థిని,విద్యార్థులకు పాఠశాల స్థాయిలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు మండల స్థాయిలో నవంబర్ 22వ తేదీన టెస్ట్ నిర్వహిస్తామని, మండల స్థాయిలో జరగబోయే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ కోసం పొస్టర్స్ ను ఆవిష్కరించారు. పాఠశాల స్థాయి లో నిర్వహించిన టాలెంట్ టెస్టును విజయవంతం చేసిన ఆయ పాఠశాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెవివి మండల కార్యదర్శి రవికుమార్,సర్పంచ్ సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.