Wednesday, 4 November 2026

గ్రామసభలు ద్వారా పోడు సమస్యలు పరిష్కరించండి

గ్రామసభలు ద్వారా పోడు సమస్యలు పరిష్కరించండి
– ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి
అశ్వరావుపేట, నవంబర్ 18( జనం సాక్షి)
అశ్వారావుపేట నియోజకవర్గం లోని గిరిజన ప్రాంతంలో ఉన్న పోడు భూముల సమస్యలను గ్రామ సభలుద్వారా అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించాలని ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి అన్నారు అశ్వారావుపేట మండలం కోయ రంగాపురం, మేకల బండ, గుంటిమడుగు గ్రామలలో గిరిజన పోడు భూములు సాగుదారులతో పోడు భూముల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోడు భూములకు సంబంధించి గ్రామ సభల నిర్వహణ పారదర్శకంగా జరగాలని అధికారులను కోరారు. పోడు భూముల సర్వేలు కూడా గ్రామసభల తీర్మానం ద్వారా జరగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించే గ్రామాలలో ముందు రోజు దండోరా, మైకులు ద్వారా ప్రసారంచేయాలని, పోడు భూముల సర్వేలపై కొంతమంది పంచాయతీ సెక్రటరీలు మరియు అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు, గిరిజన పక్షాన ఉండి న్యాయం కోసం పోరాటాలు సిద్ధంగా ఉంటామన్నారు రెవెన్యూ ఫారెస్ట్ సంబంధించిన శాఖ అధికారులు పొడు సాగుదాలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. అశ్వారావుపేట మండలంలో పోడు భూముల మొత్తం 49 హ్యబిటేషన్ల నుంచి 20,034.19 ఎకరాలకు 5,233 మంది గిరిజనులు దరఖాస్తులు చేసుఉన్నారని, పోడు భూములకు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజనుడికి పోడు భూములు సర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొప్పుల శ్రీను, నల్లపు లక్ష్మణరావు , ఉప్పల రాజశేఖర్ మండల ఓబీసీ అధ్యక్షులు, ఎస్ కే బాబా మండల మైనార్టీ అధ్యక్షుడు, రమేష్ , గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.