ఆరో వార్డులో మెట్టుపల్లి లో డ్రైనేజీ పైప్ లైన్ వేయిస్తున్న స్థానిక కౌన్సిలర్ కంచె రవి…. వనపర్తి టౌన్: డిసెంబర్ 9 ( జనం సాక్షి ) వనపర్తి పట్టణంలో 6 వార్డు మెట్టు పల్లి లో రైతులు పొలాలకు వెళ్లే దారిలో డ్రైనేజీ మురుగు నీరు చేరడం వల్ల రైతులకు వెళ్లడానికి ఇబ్బంది గురవుతున్నారని, రైతులు ఆరో వార్డు స్థానిక కౌన్సిలర్ కంచరవి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, కౌన్సిలర్ స్పందిస్తూ,పెద్ద మనసు చేసుకొని తన సొంత ఖర్చుతో, డ్రైనేజీ వాటరు రాకుండా ఈరొజు రొడ్ వెంబడి పైపులు వేసి,ట్రాక్టర్లతో మట్టి వేయించి డొజర్ సాయంతో చదును చేయించారు. రైతులు సంతోషం వ్యక్తపరుస్తూ, కౌన్సిలర్ కంచరవికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగం ఆంజనేయులు,రంగం రాములు,గొకం రంగస్వామి, సుగురు వెంకటస్వామి,సుగురు రమెష్, స్వామి,గొంకం బాలకృష్ణ,రంగం శ్రిను,మన్యం,బుచన్న, జనార్థన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరో వార్డులో మెట్టుపల్లి లో డ్రైనేజీ పైప్ లైన్ వేయిస్తున్న




