మండలంలో ఘనంగా
సోనియమ్మ జన్మదిన వేడుకలు
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
పెద్దవంగర డిసెంబర్ 09(జనం సాక్షి )తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం,60 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని,ఆకాంక్షను గుర్తించిన సోనియా గాంధీ కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంతో పాటు పోచంపల్లె గ్రామం లోని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్. మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నేడు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడు జాతీయ సలహా కమిటీ,యూపీఏ అధ్యక్షురాలుగా సోనియాగాంధీ కొనసాగిన తరుణంలో దేశవ్యాప్తంగా అనేక చట్టాలు, సంస్కరణలు అనగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్,ప్రత్యేక గుర్తింపు అథారిటీ,సమాచార హక్కు చట్టం,గ్రామీణ ఉపాధి పథకం,పలు రకాల ప్రాజెక్టులు అమలు చేయడంలో సోనియా గాంధీ పాత్ర కీలకమైనదని అన్నారు.రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ,సోనియమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మెట్టు నగేష్,ఆర్ కే తండా సర్పంచ్ జగు నాయక్ ఎస్ టీ సెల్ బానోత్ సీతారామ్ ఎస్ సి సెల్ సైదులు,ముత్యల పురాచంద్ర ర్ కనుకుంట్ల నరేష్,వేణు, సత్యం,మురళి, సతీష్, సైదులు, యువజన నాయకులు సంతోషం,అనపురం శ్రీనివాస్,కరుణాకర్, శ్రీను,అనపురం వినోద్, రాకేష్, సాయి, హరికృష్ణ, శ్రీకాంత్,మహేందర్,చిలుక వెంకన్న,తదితరులు పాల్గొన్నారు




