Wednesday, 4 November 2026

ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సర్వసభ్య సమావేశం

 

 

 

 

 

 

 

 

 

జనంసాక్షి (హుజురాబాద్) : హుజురాబాద్ మండల ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యుల ( రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్) ఆసోసియేషన్ సర్వసభ్య సమావేశం స్థానిక ప్రతాప సాయిగార్డెన్ లో ఆదివారం నిర్వహించారు. మండల ఆర్ఎంపీ. పి ఎంపీ వైద్యుల మండల అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్ అధ్యక్షతన సమావేశం జరుగగా ఆర్ఎంపీ. పిఎంపీ వైద్యుల సమస్యలు తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా సంఘం ఆదేశాల మేరకు మండల గౌరవ అధ్యక్షులు సుంకరి మాధవరెడ్డి, మండల అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యుల సమక్షంలో మండల ప్రధాన కార్యదర్శిగా సొల్లు మహేందర్, కోశాధికారిగా గొడిశాల సదానందలను ఏకగ్రీవంగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపి వైద్యుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.