Wednesday, 4 November 2026

యువ సంఘర్షణ సభకు తరలిరండి… నిరుద్యోగ విద్యార్థి యువగర్జన సభ .. తరలి రండి సభకు పెద్ద ఎత్తున యువత విద్యార్థులు నిరుద్యోగులురండి పిలుపు….. డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

 

 

 

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా మొత్తంలో అధిక సంఖ్యలో యువతలో యువకులు విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
రేపు అనగా మే 8వ తేది, మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ యువ సంఘర్షణ సభ జరుగుతుంది. ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈ సభలో ప్రియాంక గాంధీ జాబ్‌ క్యాలెండర్‌, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక హామీ, యువతకు స్వయం ఉపాధికి అవకాశాలు నిరుద్యోగ భృతి విషయాలపై భరోసా ఇవ్వనున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు రెండు సార్లు అధికారం ఇస్తే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో తీవ్రంగా విఫలమయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం యువతకు, ఉద్యోగాలు ఉపాధి కల్పించడంలో తీవ్రంగా విఫలమైంది. కేంద్రంలోను, మన రాష్ట్రంలోను యువతకు ఉద్యోగ కల్పన కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ సభకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాల నుంచి నిరుద్యోగులు, యువత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి..