Wednesday, 4 November 2026

సామాజిక తెలంగాణలో ఆర్ ఆర్ ఆర్ పేరిటరైతులకు దఘా రీజినల్ రింగ్ రోడ్డా…. రైతుల పాలిట వురితాడా త్రిబుల్ ఆర్ ఉద్యమాన్ని నడపండి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతుల గోడును పుస్తక రూపంలో సిఎల్పీ నాయకుడుకి సమర్పించిన రైతుల ప్రతినిధి తంగళ్ళ పల్లి రవి కుమార్..

 

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షికొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా అన్నదాతలు ఆగం ఆగం అవుతున్న తరుణంలో త్రిబుల్ ఆర్ పేరిట విలువైన రైతుల భూములను ప్రభుత్వం స్వాధీన పరచుకోవడంతో అనేక గ్రామాల ప్రజలు కన్నీరు మున్నురై ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నాయకులు బట్టి విక్రమార్క భవనగిరి నియోజకవర్గం లో చేపట్టిన పీపుల్స్ మార్చ్ తుది రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, త్రిబుల్ ఆర్ ఉద్యమ నాయకుడు రవికుమార్ సంవత్సరం కాలంగా నిర్వహిస్తున్న ఉద్యమాల సంపటిక, టిఆర్ఎస్ నాయకులకు బలంతో పలుమార్లు మారిన త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులతో భువనగిరి నియోజకవర్గం లోని పలు గ్రామాల అన్నదాతలకు చెందిన విలువైన భూములను త్రిబుల్ ఆర్ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కోవడంతో రైతన్నలు ఉద్యమ బాట పట్టి సంవత్సరం కావస్తున్న ఈ ప్రాంత అధికారులు గానీ అధికార పక్ష నాయకులు గానీ స్పందించకపోవడంతో భూమిని నమ్ముకున్న రైతులు సర్వం కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న విషయాలను రవికుమార్ బట్టి తో వివరించారు.
ఈ సందర్భంగా త్రిబుల్ ఆర్ రైతులకు ఉద్దేశించి సీఎల్పీ నాయకులు మాట్లాడుతూ తరతరాలుగా అన్నదాతలు నమ్ముకొని జీవిస్తున్న వారి భూములను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కోవడంతో అన్నదాతల జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు.
రైతులు ఇప్పటికే పలు దఫాలుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వారి భూములు ఇచ్చి ఇప్పటికే నష్టపోయారని, మిగిలిపోయిన కొద్ది గొప్ప భూములను కూడా ప్రభుత్వం త్రిబుల్ ఆర్ పేరిట లక్కోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన విమర్శించారు.
త్రిబుల్ ఆర్ రైతులకు ప్రభుత్వం వేదిస్తూ అనేక కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులకు ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, పోరాటం కొనసాగించండి మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్త్రం లో రాబోతుంది, కేసీఆర్ చేపట్టిన అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను సమీక్షించి రైతులకు న్యాయం చేయబోతున్నామని ఆయన హామీ ఇచ్చారు. అంతేగాక నేషనల్ హైవే అథారిటీ వారు మొదటిగా రూపొందించిన అలైన్మెంటును, ఏ పరిస్థితులలో సర్వేనెంబర్లు మార్పులు చేర్పులు చేశారో, రెండవసారి ఏ నాయకుల ప్రోద్బలంతో అలైన్మెంట్ మారిందో, మూడోసారి అలైన్మెంట్ రూపొందించేటప్పుడు ఏ టిఆర్ఎస్ నాయకుడి భూములను తప్పించేందుకు రూపొందించారో అనే అంశాలపై సమగ్ర విచారణ చేపడతామని బట్టి విక్రమార్క రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి త్రిబుల్ ఆర్ పోరాటం చేస్తున్న రైతులకు తమ మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు
కాంగ్రెస్ నాయకులు తంగాళ్ళ పల్లి రవి కుమార్ వెంట,రఘుబాబు, పల్లెర్ల యాదగిరి, అవుశెట్టి పాండు, బొజ్జ ధర్మేశ్, చింతల సురేష్, రైతునాయకులు పాల్గొన్నారు.