Wednesday, 4 November 2026

రేపు నగరానికి జవాను యాదయ్య మృతదేహం

హైదరాబాద్‌,(జనంసాక్షి): దేశ రక్షణ కోసం ముష్కరులతో పోరాడి ప్రాణాలర్పించిన సైనికుడు, అమరవీరుడు యాదయ్య మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. రేపు అమర జవాను భౌతికకాయాన్ని నగరానికి చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. యాదయ్య స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి. నిన్న శ్రీనగర్‌లో ముష్కర మూకల దాడిలో యాదయ్య హోరాహోరీ పోరాడి అమరుడైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *