హైదరాబాద్: ఆర్టీసీలో వందశాతం సమ్మె ఉండదని బావిస్తున్నట్లు పిసిసి చిఫ్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సమ్మె అనివార్యమయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ అంశంలో నేతల వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందించనని తెలిపారు. అధిష్టానం నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉండాలని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేసినట్లు బొత్స తెలిపారు. సున్నితమైన అంశంపై ఇతరులను ఇబ్బంది పెట్టేలా మాట్లాడకూడదని ఆయన చెప్పారు.




