నిరుద్యోగులను వంచించిన కెసిఆర్
పోరాటాలు సిపిఐకి కొత్తకాదు: చాడ
హైదరాబాద్,నవంబర్19(జనం సాక్షి): పోరాటాలు సీపీఐకి కొత్తేవిూ కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సిఎం కెసిఆర్ తెలంగాణ ప్రయోజనాలనే పణంగా పెట్టారని అన్నారు. 50వేల కటుఉటంబాలు, వారిపై ఆధారపడడ్ వారి జీవితాలు ఇప్పుడు గాలిలో దీపంలా మారయన్నారు. అయినా కెసిఆర్లో చలనంకానరాక పోవడం ఆయన నిజాం నిరంకువ పోకడలకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వైఫల్యాలను తూర్పారా పట్టారు. ప్రజలకు ఆశలు చూపి వమ్మ చేవారని, నయా నిజం నవాబు పాలన సాగించారని మండిపడ్డారు. విద్య, వైద్యంతో పాటు జీవించే హక్కును హరించే పరిస్థితులు తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్నాయని అన్నారు. ఇపుడు రాష్ట్రంలో సంక్షేమ,అభివృద్ది పథకాలు సంపూర్ణ స్థాయిలో అమలు చేయాల్సి ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు తమ పోరాటాలు కొనసాగుతాయని చాడ తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు నిధులు రావడం లేదు.. బీసీల వెనుకబాటుతనం అలాగే ఉందని తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా లక్ష ఉద్యోగాల ప్రకటన బూటకమని తేలిందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు భరోసా కల్పించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలను ఊడబెరికేలా ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకువ విధానాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలు, జూనియర్, డిగ్రీ, ఏయిడెడ్, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వేలాది ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అందించడంలో విఫలమయ్యారని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యాప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదపు టంచుల్లో అన్నారు. కలుషిత రాజకీయాలను ప్రక్షాళన చేయడమే సీపీఐ లక్ష్యమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టులను అవమానపరిచేలా సిఎంకెసిఆర్ చరిత్రను వక్రీకరించేలా నిజాం నవాబును పొగడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాలతో సాధించుకున్న వేనని గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయని, ఎప్పుడూ లేని విధంగా పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని అన్నారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నాయకుడు ఆరోపించారు. ఉప్పులు, పప్పులు, నూనె, కూరగాయల ధరలు మండిపోతున్నాయని, ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. అధిక ధరలను నిరసిస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, ఎఫ్‌డీఐలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ధరలను నియంత్రిస్తామని గ్దదెనెక్కిన ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన ధరలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఉల్లిధరలు ఆకాశాన్ని అంటుతున్నా సర్కార్‌లో చలనంకానరావడంలేదన్నారు. వైఫల్యాలకు ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదన్నారు.




