Tuesday, 3 November 2026

ఆర్టీసీ బస్సులు తిరిగి పునరుద్ధరించాలి

వరంగల్ ఈస్ట్, జోన్ 01 (జనం సాక్షి) విద్యార్థులు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను గతంలో తిరిగిన రూట్లో మళ్ళీ తిరిగేలా పునరుద్ధరించాలని వరంగల్ సామాజిక న్యాయవేదిక ప్రధాన కార్యదర్శి అచ్చ వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ముఖ్యంగా హన్మకొండ బస్టాండ్ నుండి ఖిలా వరంగల్ తూర్పు పడమరకోటలకు వేర్వేరు బస్సులను రోజు ఏడు ట్రిప్పులు గతంలో నడిచేవని, అలాగే హనుమకొండ నుండి బట్టల బజారు, కరీమాబాదు, రంగసాయిపేట మీదుగా విద్యార్థుల ప్రజల సౌకర్యార్థం బస్సులు నడిపారని పేర్కొన్నారు. అంతే కాకుండా వరంగల్ బస్ స్టేషన్ నుండి మండి బజార్ పోచం మైదాన్ మీదుగా కాజీపేట వరకు నిత్యం బస్సులు నడిచేయమని వినతి పత్రంలో తెలిపారు. ఇప్పుడున్న కాలంలో బస్సులు అందుబాటులో లేకపోవడం వలన విద్యార్థులు సకాలంలో కాలేజీలకు పాఠశాలలకు పోవాలంటే ఆటోలను ఆశ్రయించడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్టు వివరించారు. కాబట్టి బస్సులను జూన్ 1వ తేదీ నుండి విద్యా సంవత్సరం మొదలవుతుంది కాబట్టి యధా స్థానంలో బస్సులు నడుపుతూ విద్యార్థులు ప్రయాణికులకు యాత్రికులకు సౌకర్యం కలిగించాలని ఎమ్మెల్యే నరేందర్ ను అచ్చ వినోద్ కుమార్ కోరారు. ఈ విషయంలో ఎమ్మెల్యే నరేందర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.