Monday, 2 November 2026

కార్యకర్త కూతురి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే షిండే

బిచ్కుంద జూన్ 01 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని జుక్కల్ మండలకేంద్రంలో గల లక్ష్మీ కళ్యాణం మండపంలో గురువారం నాడు జరిగిన చిన్న ఏడ్గి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త లక్ష్మణ్ గొండా కూతురి వివాహ వేడుకకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శివాజీ, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ మనోజ్ పటేల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గజు పటేల్, జానకి బాలాజీ, బాలకృష్ణ, సంతోష్ గోండ తదితరులు పాల్గొన్నారు.