Wednesday, 4 November 2026

మానవ హక్కుల పితామహుడు పూలే.

నెన్నెల, ఏప్రిల్ 11, (జనంసాక్షి )భారత దేశంలో మానవ హక్కుల పితామహుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని నర్వాయి పేట ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు జలంపెల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతి రావు పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత దేశంలో మానవ హక్కుల కోసం పోరాడి, చదువు అందరికి అందజేస్తూ, మహిళా హక్కులను పరిరక్షిస్తూ, అనేక సామజిక దురాచారాలను పారద్రోలిన సాంఘిక విప్లవ కారుడు అని కొనియాడారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్దపల్లి స్నేహలత, రాజ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.