నిమ్జ్ భూ నిర్వాసితులు నిరసన
జహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిమ్జ్ భూ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆశప్ప మాట్లాడుతూనిమ్జ్ భూ నిర్వాసితులపై ప్రభుత్వం చట్ట విరుద్ధమైన ప్రకటన చేస్తూ బలవంత భూసేకరణ చేయాలని చూస్తుంది గత నెలలో రైతులకు సమాచారం ఇవ్వకుండా ముందస్తు సమావేశం ఏర్పాటు చేయకుండా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అన్నారు. గతంలోనే ఇచ్చిన 11/1 నోటిఫికేషన్ కు (ప్రైమరీ నోటిఫికేషన్ రైతులందరూ సమాధానం ఇవ్వడం జరిగింది అధికారులు తిరిగి సమాధానమివ్వకుండా మరో నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటి అని మండిపడ్డారు. మరోసారి రైతులు ఈ చట్ట విరుద్ధమైన నోటిఫికేషన్ చెల్లవు అంటూ ఆర్డిఓ కార్యాలయానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారము అధికారులు నడుసుకోవాలంటూ అధికారులకు వివరించడం జరిగింది. చట్టాన్ని తుంగల తొక్కి రైతులకు 15 లక్షలు ఇస్తామని ప్రచారం ఏదైతే నిర్వహిస్తున్నారో ఏ ప్రామాణిక ప్రకారము 15 లక్షలు ఇస్తాము అని అధికారులు చెప్తున్నారు వివరణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్జ్ భూ నిర్వాసితులు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయం నిమ్జ్ భూ నిర్వాసితులు నిరసనఆర్డీవో కార్యాలయం




