కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు గా పనిచేయాలి
జహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు గా పనిచేయాలని మాజీ మంత్రి గీతారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ మెంబర్ షిప్ ఇంచార్జ్ బొల్లుకిషన్ అన్నారు.బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మాజీమంత్రి, డా.జె. గీతారెడ్డి ఆధ్వర్యంలో హత్ సె హత్ జోడో అభియాన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాయి అన్నారు. . ఈకార్యక్రమంలో,జహీరాబాద్ బ్లాక్ అధ్యక్షులు హర్షద్ పట్టణ అధ్యక్షులు ఖండ్యం నర్సింలు,మండల అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, పి.రామలింగ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మొహ్మద్ మాక్సుద్, అధ్యక్షులు, ప్రియాంకా గుండారెడ్డి, దేవదాసు, కుమారి మాధవి నర్సింలు, మాజీ మరియు ప్రస్తుత మాజీ జడ్పీటిసి భాస్కర్ రెడ్డి, వినీల నరేష్,, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హర్షద్ అలీ, శమేల్, యూత్ కాంగ్రెస్ అద్యక్షులు నరేశ్ గౌడ్, సర్పంచ్ లు, గ్రామాధ్యక్షులు, భుత్ ప్రెసిడెంట్ లు కౌంస్లర్ లు, వార్డు ఇంచార్జ్ లు, మహిళా కాంగ్రెస్,ఎస్సి ఎస్టీ బిసి కిసాన్, మైనార్టీ సెల్ నాయకులు,కో అపరేటివ్ చైర్మన్ లు, డైరెక్టర్ లు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు గా పనిచేయాలి




